శేరిలింగంపల్లి, జూన్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని తారానగర్ లో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులను జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ భాస్కర్, స్థానిక నాయకులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, శేరిలింగంపల్లి డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, కే రాంచందర్, పురం విష్ణువర్ధన్ రెడ్డి, నారాయణ, లక్ష్మణ్ గౌడ్, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, పవన్, వెంకటేష్, మల్లేష్, రాకేష్, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.