రాజీవ్ గృహకల్ప వాసులకు కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్ కృత‌జ్ఞ‌త‌లు

శేరిలింగంప‌ల్లి‌ ‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో త‌న‌కు ఓటు వేసి గెలిపించిన శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ ప‌రిధిలోని రాజీవ్ గృహకల్ప వాసులకు కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సోమ‌వారం సాయంత్రం స్థానికంగా ఆయ‌న రోడ్ షో నిర్వ‌హించి స్థానికుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. రాజీవ్ గృహ‌క‌ల్ప అంటే త‌న‌కు ప్ర‌త్యేక అభిమానం అని అన్నారు. త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి త‌న‌కు ఓటు వేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌న్నారు. అపార్ట్‌మెంట్ వాసుల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చినా ప‌రిష్క‌రిస్తాన‌ని తెలిపారు.

రాజీవ్ గృహకల్పలో రోడ్ షో నిర్వ‌హిస్తున్న కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్

వార్డు మెంబర్ శ్రీకళ ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో చంద్రకళ, రజిని, సదా, శ్రీయ, భాగ్యలక్ష్మీ, సుజాత, సౌజన్య, కుమారి, కళ్యాణి, కమల, నజియా, జయ, గౌసియా, సుధారాణి, గోపీనగర్ టీఆర్ఎస్ బస్తీ కమిటీ గౌరవ అధ్యక్షుడు గోపాల్, నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఎల్లేష్, శ్రీకాంత్, హరి,‌ బాలాజీ, రవికుమార్, బద్దం రమణా రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

స్థానికుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here