కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలో ప్రతి సమస్య పరిష్కారం అయ్యే వరకు కృషి చేస్తానని, ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కార్పొటర్ హమీద్ పటేల్ అన్నారు. డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో హమీద్ పటేల్ గురువారం పర్యటించారు. కాలనీలోని ప్రజల దగ్గరకు వెళ్లి ప్రతి సమస్యను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు సమాచారం అందించి, సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
రాఘవేంద్ర కాలనీలోని ప్రధాన వీధులలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ దాదాపుగా పూర్తి చేశామని, మిగిలిన విధులలోని అంతర్గత రోడ్లను, డ్రైనేజీ లైన్లను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవటం జరుగుతుందని హమీద్ పటేల్ తెలిపారు. నూతనంగా భవనాలు నిర్మిస్తున్న భవన యజమానుదారులు వారి హద్దుల ప్రకారం భవన నిర్మాణాలు కొనసాగించాలని సూచించారు. రాజరాజేశ్వరి కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, కాలనీని అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. ఎమ్యెల్యే గాంధీ, ప్రజలు మంచి సహకారం అందించటంతోనే అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయగలుగుతున్నామని, ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ నిర్మల, రాజరాజేశ్వరి కాలనీ వైస్ ప్రెసిడెంట్ కొల్లూరు మధు ముదిరాజ్, అజయ్ సింగ్, శ్రీనివాస్, శైలేందర్, లక్ష్మి కాంతం, శ్రావణి, బాబా, మహమ్మద్, యూత్ నాయకులు దీపక్, క్రాంతి, శ్రీను, వెంకటేష్, ప్రభు, లక్ష్మణ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.