మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని మియపూర్ లోని జై విశ్వకర్మ గ్యారేజీలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎల్లేష్, రవీందర్, బాలేష్, రాజేంద్రప్రసాద్, శ్రవణ్, అనిల్, గజేందర్, శైలేందర్, సంతోష్, సురేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.