– మహిషాసురమర్ధని అవతారంలో అమ్మవారి దర్శనం

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ శిల్ప ఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారద పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదవ రోజు శనివారం ఆలయంలోని భ్రమరాంబ అమ్మవారు శ్రీ మహిషాసురమర్ధని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో చండీ హోమం నిర్వహించారు. పురోహితులు, భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చండీహోమంలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి సభ్యులతోపాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో . స్థానిక భక్తులు నర్సయ్య, ప్రమీల, మురళీపావని, సాయినాగేశ్వర్, రవితేజ, నీలిమ, వెంకటరమణ,శిరీష, రెడ్డిపవన్, అభిజ్ఞలు వివిధ సేవల్లో భాగస్వాములయ్యారు.

అన్నపూర్ణ ఎంక్లేవ్ లో…
చందానగర్ అన్నపూర్ణ ఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ షిర్డి సాయిబాబా, అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎనిమిదవ రోజు శనివారం అమ్మవారు శ్రీ మహిషాసురమర్దని అవతారంలో పూజలు అందుకున్నారు. అమ్మవారు మహిషాసురున్ని అంతమొందిస్తున్నట్టు అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ పాలకమండలి సభ్యులతోపాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తరించారు.
