గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి బిజేవైఎం నేతల సన్మానం

గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గా కొత్తగా ఎన్నికైన వాసేపల్లి గంగాధర్ రెడ్డిని బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరపున ఏకైక కార్పొరేటర్ గా గచ్చిబౌలి డివిజన్ నుండి గంగాధర్ రెడ్డి విజయం సాధించడం సంతోషకరమని అన్నారు. ఆయన గెలుపు స్థానిక యువతలో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలపడిందనడానికి ఈ గెలుపు నిదర్శనమని అన్నరు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు ప్రవీణ్, నరేష్, భరత్, టిప్పు, నవీన్, వెంకటేష్, అఖిల్, శ్రీను, హార్ష, జశ్వంత్, తేజ, లోకేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

గంగాధర్ రెడ్డిని సన్మానిస్తున్న బిజెవైఎం నాయకులు రాహుల్, తదితరులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here