నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆద్వర్యంలో కరోనా రోగులకు చేస్తున్న సేవలకు గాను దాతల నుంచి విశేష స్పందన లభిస్తుంది. సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా కొనసాగుతున్న సేవలకు తమ వంతు సహకారం అందించేందుకు వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం న్యూలాండ్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ తరపున సంస్థ ప్రతినిదులు శ్రీరామ్, భాస్కర్‌లు రూ.20 లక్షల చెక్కుతో పాటు 1000 కోవిడ్ మెడికల్ కిట్స్, 10 ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లు సీపీ సజ్జనార్‌కు అందేశారు. అదేవిధంగా సువెన్ ట్రస్ట్ ప్రతినిధులు సైతం కోవిడ్ రోగుల సేవల కోసం రూ.20 లక్షల చెక్కును సీపీకి అందజేశారు. వారితో పాటు క్యామ్‌సన్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ముకేష్‌కుమార్, ఎండీ మనీష్ కుమార్, హెచ్ఆర్ నర్సింగ్‌లు 300(500ఎంఎల్), 250(100ఎంఎల్), 2000(20ఎంఎల్) శానిటైజర్ బాటిల్స్‌తో పాటు 30 వేల మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కోవిడ్ కష్టకాంలో ఎస్‌సీఎస్‌సీ ద్వారా మేము అందిస్తున్న సేవలకు వివిధ సంస్థలు, ప్రముఖులు, ప్రజల నుంచి అందుస్తున్న విశేష స్పందన అభినందనీయమని, వారి సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సీఎస్‌సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల తదితరులు పాల్గొన్నారు.