చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎనక్లేవ్, ఏవిఏస్ అవాస అపార్ట్మెంట్, గంగారాం హరిజన బస్తి, సాయి నగర్‌లలో స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మంగళవారం పర్యటించారు. కరోనా మహ్మమరి నియంత్రణలో భాగంగా ఆయ కాలనీలో ఆమె దగ్గరుండి డీఆర్ఎఫ్ సిబ్బందిచే సోడియం హైపోక్లోరైడ్ ద్రావాణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా బారి పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. అవసరమైతెనే ప్రజలు బయటికి రావాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మేరుగైనా చికిత్స అందించేందుకు మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో కరోనా పేషంట్ల చికిత్స కోసం కోండాపుర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మేరుగైనా వైద్య సదుపాయం అందించడం జరుగుతుందన్నారు. డివిజన్‌లో ఏ సమస్య తలెత్తిన తమకు సమాచారం అందించాలని, వెంటనే సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అద్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, స్థానిక అసోసియేషన్ సభ్యులు శ్రీధర్ రెడ్డి, చేన్నారెడ్డి, అరవిందా, కవిత, రమ, అశ్విని రెడ్డి, కృష్ణవేణి, ముర్తి తదితరులు పాల్గొన్నారు.