నమస్తే శేరిలింగంపల్లి: రవికుమార్ యాదవ్(ఆర్‌కేవై) ప్రాణహేతు ఆద్వర్యంలో శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జీ వద్ద నిరుపేదలకు ఉచిత భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి తమ ఆర్‌కేవై బృందం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని అన్నారు. నిరుపేదలకు నిత్యవసర వస్తువులు, భోజన వసతి, మాస్క్ లు, శానిటైజర్లు, మందులు వంటివి పంపిణీ చేస్తున్న కరోనా కష్టకాలంలో ప్రజలకు బరోసా కల్పిస్తున్నదని అన్నారు. వంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని టీం సభ్యులు తెలియజేశారు. కరోనా విజృంభన నేపథ్యంలో రాజకీయలకు అతీతంగా ప్రజలకు సేవలందించాల్సిన భాద్యత అందరిపైన ఉన్నదని అన్నారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి సహయ సహాకారాలు కావాలన్న తమ ఆర్‌కేవై ప్రాణహేతు హెల్ప్‌లైన్ నెంబర్ 7901629623కి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, ఆర్‌కేవై ప్రాణహేతు ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్, ప్రతినిధులు జాజిరావు, శ్రీను, రాము, చంద్రమాసిరెడ్డి, సోనుకుమార్ యాదవ్, సోమయ్య యాదవ్, బాలరాజు సాగర్ తదితరులు పాల్గొన్నారు.
