శేరిలింగంపల్లి, ఏప్రిల్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): బిఆర్ఎస్ భవన్ లో మాజీ మంత్రి, సనత్ నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నికి ముఖ్య అతిథులుగా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొని దిశా నిర్దేశం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ 2001లో పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణలో ఈ పార్టీ ఉంటదా లేదా అని చెప్పిన వారు తెలంగాణ ఎప్పుడు తీసుకురావాలి అని ఆ రోజు అవహేళన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారని అటువంటి సమయంలో పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణను తీసుకొచ్చి పది సంవత్సరాలు పరిపాలించి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టారని అన్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కూడా కేసీఆర్ ది అని అందుకే జిహెచ్ఎంసి లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ పెద్ద ఎత్తున 27న జరిగే సభకు తరలివచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగారావు, కొమిరిశెట్టి సాయిబాబా, ముఖ్య నాయకులు వాలా హరీష్ రావు, మారబోయిన రవి యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి సతీష్ రావు, శ్రీకాంత్ ముదిరాజ్, గొట్టిముక్కల పెద్ద భాస్కరరావు, మాచర్ల భద్రయ్య, అల్లావుద్దీన్, బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, రోజా, గోపు శ్రీనివాస్, శ్రీకాంత్ యాదవ్, వెంకట్రావు, వెంకటేష్ యాదవ్, మల్లేష్, మల్లారెడ్డి, సలీం, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.