పెంచిన ధరలను తగ్గించాలి – కాంగ్రెస్ సీనియర్ నాయకులు‌ జెరిపాటి జైపాల్ – విద్యుత్ సౌద ముట్టడికి తరలిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు

నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు జెరిపాటి జైపాల్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను నిరసిస్తూ విద్యుత్ సౌద ను ముట్టడించాలని టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి‌ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో కలిసి విద్యుత్ సౌద ముట్టడిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెరిపాటి జైపాల్ మాట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, డీజిల్, పెట్రోల్, వంట‌ గ్యాస్ ధరలను నియంత్రించాలని, రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధరల పెంపుతో సామాన్య ప్రజల జీవనం‌ కష్టతరంగా మారిందన్నారు. రైతులు పండించిన ప్రతి వరి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, శేరిలింగంపల్లి నాయకులు, మరేళ్ల శ్రీను, జావీద్ హుస్సేన్, కాట నరసింహ గౌడ్, పోచయ్య, మాణెమ్మ, అరుణ, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సౌందర్య రాజన్, సైదులు, ఖాజా, కిరణ్, దుర్గేశ్ తో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

విద్యుత్ సౌద ముట్టడిలో పాల్గొన్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here