శేరిలింగంపల్లి, మార్చి 23 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు సునీతా రావు పిలుపుమేరకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జ్యోతి బీమ్ భరత ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్ ఆధ్వర్యంలో కొండాపూర్, శేరిలింగంపల్లి, మాదాపూర్, హఫీజ్ పేట్ బి బ్లాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర మహిళ కాంగ్రెస్ సెక్రెటరీ రమాదేవి, శేరిలింగంపల్లి జనరల్ సెక్రెటరీ భవాని, సెక్రెటరీ జ్యోతి, ఎ బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీదేవి, బి బ్లాక్ ప్రెసిడెంట్ భాగ్యలక్మి , కొండాపూర్ అధ్యక్షురాలు కావేటి లక్ష్మీ, శేరిలింగంపల్లి అధ్యక్షురాలు తన్వీర్, మాదాపూర్ అధ్యక్షురాలు ఉమామినంపల్లి, హఫీజ్ పెట్ అధ్యక్షురాలు షబానాతో కలిసి కమిటీలకు నియామక పత్రాలను సభ్యులకు అందజేశారు.