శేరిలింగంపల్లి, మార్చి 23 (నమస్తే శేరిలింగంపల్లి): భగత్ సింగ్, రాజ్ గురుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. సీపీఐ శేరిలింగంపల్లి, ఏఐవైఎఫ్ఏఐఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు సుఖ్‌దేవ్‌ల వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కే శివకుమార్, ధర్మ తేజ, శ్రీనివాస్, కొండలయ్య, రాందాస్, అంజి తదితరులు పాల్గొన్నారు.