శేరిలింగంపల్లి, మే 1 (నమస్తే శేరిలింగంపల్లి): యువత రాజకీయాల్లో ఎదగడానికి అవకాశం ఉన్న ఏకైక రాజకీయ సంస్థ కాంగ్రెస్ పార్టీ అని, దార్శనిక నాయకుడు సేవకు నిబద్ధత తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, అందుకే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, రాజకీయాల నాణ్యత మెరుగుపడుతోందని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో శంషాబాద్ కేఎల్సిసి కన్వెన్షన్ లో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఏఐసీసీ సభ్యుడు చల్లా వంశీ చంద్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ లు, డివిజన్ అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులతో కలిసి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాపాలనకు నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందని, మాట ఇచ్చాం, చేసి చూపిస్తాం అని అన్నారు. అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా తాము ప్రజలకు, మైనార్టీలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ, మీతో నడుస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.