శేరిలింగంపల్లి, మే 1 (నమస్తే శేరిలింగంపల్లి): మే డే సందర్భంగా పారిశుద్ధ్య, విద్యుత్, జలమండలి కార్మికులను నేతాజీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం, చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయని, ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయని అన్నారు. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షుడు నరసింహ యాదవ్ , ఉపాధ్యక్షుడు రాయుడు, యువజన విభాగం అధ్యక్షుడు డీజే భవన్, లవన్ చారి, అసోసియేషన్ సభ్యులు జిహెచ్ఎంసి స్లీపర్ లక్ష్మమ్మ, దాస్, విద్యుత్ కార్మికుడు చరణ్ నాయక్ పాల్గొన్నారు.