శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): నారాయణ మాదాపూర్ వాల్మీకి భవన్ లో విద్యార్థులు హాలిడేస్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటామని 100 కి ఫోన్ చేసి వాళ్ళ బాధ వెలిబుచ్చుతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం బాధాకరమని AIFDS రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి అన్నారు. గత ఐదురోజుల క్రితం AIFDS, bsfi ఆద్వర్యం లో హాలిడేస్ కావాలని విద్యార్ధులు ప్రత్యక్షంగా నినాదాలు ఇస్తూ నిరసన తెలియజేయడం జరిగిందని, మళ్ళీ తాజాగా విద్యార్ధులు క్లాసులు బాయ్‌కాట్ చేసి 3 గంటల పాటు హాలిడేస్ కావాలని నిరసన తెలిపారని అన్నారు. గత వారం రోజులుగా హాలిడేస్ ప్రకటిస్తాం అని విద్యార్ధి సంఘాల మాటలు కూడా వినకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు.
విద్యార్థులను చదువుల చట్రంలో పడేసి తీవ్ర మనోవేదన గురించేస్తున్నారని, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్చి 30 తరువాత హాలిడేస్ ప్రకటించినా, నారాయణ యాజమాన్యం తమ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తాజాగా విద్యార్థులు చేసిన పోరాటాన్ని అణచడం కోసం నారాయణ వాల్మీకి భవన్ ప్రిన్సిపాల్ భాను వర్ధన్, AGM ఉపేందర్ రెడ్డి హాలిడేస్ ఇస్తామని హామీ ఇచ్చారని, అయినా ఇప్పటివరకు విద్యార్థులను హాలిడేస్‌కు పంపించడం లేదని అన్నారు. ఈ విషయం తెలుసుకొని వెళ్ళిన AIFDS బృందం యాజమాన్యంతో మాట్లాడిందని, అయినప్పటికీ వారిలో ఎలాంటి చలనం లేదన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం తమ పద్ధతిని మార్చుకుని వెంటనే విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని, లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.