శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా న్యూ జెర్సీ నుండి విచ్చేసిన కూచిపూడి కళాకారిణి నీలిమ రాజు తన ప్రదర్శనలో కృష్ణ పంచకం, నారాయణీయం, వీక్షేదా దేవ దేవం అంశాలను ప్రదర్శించి మెప్పించారు. సంచలన స్కూల్ అఫ్ డాన్స్ నాట్య గురువు పద్మ కళ్యాణ్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో మూషిక వాహనం, గంధము పూయరుగా, జనుత శబదం, చిన్న వినాయక కౌతం, జయ జయ దుర్గే, నీల మేఘ శరీర, దశావతారం అంశాలను కృతిక, కుందన, శాన్విక , శ్రీలత, సహస్ర, వన్య, నేత్ర, ఉష శ్రీ, సాహితి , ఆశ్రిత, చక్రికా, రిధి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.