శేరిలింగంప‌ల్లిలో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు

మియాపూర్‌/హ‌ఫీజ్‌పేట‌/చ‌ందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ప‌లు డివిజ‌న్ల‌లో ప్ర‌భుత్వ‌విప్ ఆరెక‌పూడి గాంధీ ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు.

మియాపూర్ డివిజన్ లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌భుత్వ‌విప్ ఆరెక‌పూడి గాంధీ

మియాపూర్‌లో…
మియాపూర్ డివిజన్ ప‌రిధిలో రూ.6 కోట్ల 68 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాప‌న‌లు చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు డీఈ రూపా దేవి, ఏఈ రమేష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్‌, డివిజన్ తెరాస అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, తెరాస నాయకులు పురుషోత్తం యాదవ్, గంగాధర్, బీఎస్ఎన్‌ కిరణ్ యాదవ్, గోపాల్ రావు, మోహన్ ముదిరాజ్, అన్వ‌ర్ షరీఫ్, ప్రతాప్ రెడ్డి, దాసరి గోపి కృష్ణ, కిషోర్, విద్యాసాగర్, మల్లేష్, గురువయ్య, నర్సింహ రాజు, మాణిక్యం, ముస్తఫా, నరేందర్, చంద్రిక ప్రసాద్ గౌడ్, రోజా, వరలక్ష్మి, ఉమ‌, సుప్రజ, రాణి పాల్గొన్నారు.

హ‌ఫీజ్‌పేట డివిజ‌న్‌లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌భుత్వ‌విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

హ‌ఫీజ్‌పేట‌లో…
హ‌ఫీజ్‌పేట్ డివిజన్ ప‌రిధిలో రూ. 5 కోట్ల 62 లక్షల 50 వేల అంచనా వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్ ల‌తో క‌లిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాప‌న‌లు చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు డీఈ రూపా దేవి, సురేష్ కుమార్, ఏఈ అనురాగ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, డివిజన్ తెరాస అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు వాలా హరీష్ రావు, లక్ష్మారెడ్డి, జేరిపాటి రాజు, రవీందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, దొంతి శేఖర్, కంది జ్ఞానేశ్వర్, సుధాకర్, రమణ, వెంకటేష్ గౌడ్, యాదగిరి గౌడ్, పద్మరావు, శివ, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.

చందాన‌గ‌ర్ డివిజ‌న్‌లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌భుత్వ‌విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి

చందాన‌గ‌ర్‌లో…
చందానగర్ డివిజన్ ప‌రిధిలో రూ.4 కోట్ల 71 లక్షల 30 వేల అంచనా వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డితో క‌లిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాప‌న‌లు చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు డీఈ రూపా దేవి, ఏఈ అనురాగ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, రవీందర్ రావు, సునీత రెడ్డి, రాఘవేందర్ రావు, డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు మిర్యాల రాఘవరావు, ఉరిటి వెంకట్రావు, దాసరి గోపి కృష్ణ, జేరిపాటి రాజు, ప్రవీణ్, రమణ, అక్బర్ ఖాన్, జనార్దన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, పోశెట్టి, గౌస్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here