మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసి ఎన్నికల్లో మియాపూర్ స్థానం నుండి బిజెపి పార్టీ తరపున పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ స్థానిక బిజెపి నాయకులు కలివేముల మనోహర్ వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర సంఘటన మంత్రి మంత్రి శ్రీనివాస్ కు బయోడేట అందజేశారు. గత 26 సంవత్సరాలుగా బిజెపి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ రాజకీయ, సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకున్నట్లు పేర్కొన్నారు. తాను చిన్నప్పటి నుండి ఆరెస్సెస్ స్వయం సేవక్ గా కొనసాగుతున్నానని, ఎబివిపి లో నిజామ్ కళాశాలలో కార్యదర్శిగా, హఫీజ్ పేట డివిజన్ బిజెపి అధ్యక్షుడిగా పనిచేశానని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా(అర్బన్) శేరిలింగంపల్లి చేనేత సెల్ కన్వీనర్ గా పని చేశానన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీలో బిజెపి కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు. మియాపూర్ డివిజన్ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు.