శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లేష్ జోగు, నరేష్, ఎల్లెష్ అలకుంట, ప్రవీణ్ కుమార్ గచ్చిబౌలి డివిజన్ లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సమక్షంలో ఆయన కార్యాలయంలో బీజేపీలో చేరారు. వారికి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి అనేక మంది బీజేపీలో చేరుతున్నారని తెలిపారు.
గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అతి తక్కువ కాలంలోనే చేసి చుపించిందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ఏకైక అజెండాగా ముందుకు సాగుతున్న బీజేపీని ఎదుర్కునే సత్తా ఏ పార్టీకి లేదని అన్నారు. బీజేపీని నమ్మి చేరిన వారికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. కష్టపడ్డ వారికి పార్టీలో సముచిత స్థానం తప్పక లబిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుమన్, మన్నే విష్ణు, మల్లేష్ జోగు, నరేష్, ఎల్లెష్ అలకుంట, ప్రవీణ్ కుమార్, వంశి, చిన్న, దేవేష్, మోహన్, విష్ణు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.