శేరిలింగంపల్లి, నవంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని కోకానట్ గ్రో అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. కోకానట్ గ్రో అసోసియేషన్ సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, PAC ఛైర్మెన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో అసోషియన్ పరిధిలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని, డివిజన్ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, మెరుగైన ప్రజా జీవనానికి అన్నిరకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషిచేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కోకానట్ గ్రో అసోసియేషన్ సభ్యులు రాంకిషోర్, శ్రీనివాస్ రెడ్డి, గంగరాజు యాదవ్, రాజశేఖర్ రెడ్డి, రవి, వివేకానంద రెడ్డి, ప్రసన్న, రాజేష్, సంతోష్, రవికిరణ్, రమేష్ రెడ్డి, రావెళ్ల, ఫణి బోహ, ఫణి రామ్, కరీం, శరత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.