గ‌చ్చిబౌలిలో 5కె ర‌న్‌

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి స్టేడియం వద్ద ప్రణవ్ తేజ్, అక్రాంత్ దేవరకొండ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K, 2K రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక శ్రమ ఎంతో అవసరం అని గుర్తు చేయడం కోసం ఈ రన్ ఎంతగానో తోడ్పడుతుంది అని అన్నారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, జనార్దన్ రెడ్డి, కరుణాకర్ గౌడ్, రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు.

ర‌న్‌ను ప్రారంభిస్తున్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here