శేరిలింగంపల్లి, నవంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): మహంకాళి నగర్ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్, ఉజ్జయిని మహంకాళి నగర్ లో సమావేశాలు, వేడుకలు, నిర్వహించుకోవడానికి వీలుగా కాలనీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందరి సహకారంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాలనీ వాసుల ఆహ్వానం మేరకు సీనియర్ నాయకుడు నర్సింగ్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవన నిర్మాణం చేపట్టినందుకు అభినందనలు తెలియజేశారు. కాలనీ ప్రజలు అందరూ శుభ్రంగా ఉంచుకుంటూ , ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటివ్వకుండా వేడుకలకు, సమావేశాలకు, వినియోగించుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమంలో రాము, వెంకట్, ఆంజనేయులు, పాండు, శ్రీనివాస్, రమణ, చండయ్య, చాంద్, సైదులు,అశోక్, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.