నిరుపేదల వైద్యానికి ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి ఒక వ‌రం: ప్ర‌భుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ఆస్పత్రిలో అత్యవసర చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముందస్తు ఆర్థిక సహాయం కోరుతూ ధరఖాస్తు చేసుకున్న ఇద్దరు లబ్ధిదారులకు మంజూరైన రూ. 6.50 లక్షల ముఖ్య మంత్రి సహాయ నిధి ఎల్ ఓ సీ ని సోమవారం ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల గ్రామానికి చెందిన శ్వేత ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకుగాను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముందస్తుగానే రూ. 5 లక్షలు, మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ కు చెందిన రాములుకు రూ.1.50 లక్షల ఎల్ ఓ సీ లు మంజూరయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రోజాదేవి రంగారావు, మాజీ కార్పొరేటర్ రంగారావు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,టీఆర్ఎస్ నాయకులు గుమ్మడి శ్రీనివాస్ ,రాంచందర్ , ఎల్లంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

అత్యవసర చికిత్స కోసం మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీని అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here