నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట ఆపన్నహస్తంలా మారిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ కి చెందిన కృష్ణం రాజు కు అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 2 లక్షల ఎల్ ఓ సీ ని బుధవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎంతోమంది పేదలకు బాసట కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బ్రిక్ శ్రీనివాస్ , పద్మారావు తదితరులు పాల్గొన్నారు.
