నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నియామకమై బాధ్యతలు చేపట్టిన ప్రియాంక ఆల ఐఏఎస్ ను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి బుధవారం జోనల్ కమిషనర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జడ్సీ ప్రియాంకకు పూలమొక్క అందజేసి దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతమయ్యేలా చూడాలని కోరారు. చందానగర్ డివిజన్ అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కోరారు.