నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ఉద్యమకారులకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం తెలంగాణ ఉద్యమకారులు మిద్దెల మల్లారెడ్డి, సంగారెడ్డి కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పనిచేసిన ఉద్యమకారులను ఏకం చేస్తూ అప్పటి ఉద్యమకారులను కలవడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే బుధవారం హుడా కాలనీలోని రాజు యాదవ్ కలిశారు. ఉద్యమ సమయంలో చేసిన కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తే చాలని, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే, కార్పొరేటర్ సీట్లు, వార్డు మెంబర్స్, నామినేటెడ్ ఫోస్టులు ఇచ్చి పెద్ద పీట వేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గంగారం సంగారెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, జమీర్ తదితరులు ఉన్నారు.