శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం సహాయం అందజేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీకి చెందిన బిసన్న, రాధిక దంపతుల కుమారుడు సాయి తరుణ్ ఇలీవలే ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి చనిపోగా వారి కుటుంబానికి మంజూరైన రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని గాంధీ అందజేశారు. అలాగే గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లకు చెందిన ఎస్‌వీ నవీన్ సుబ్బరాజు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం దరఖాస్తు చేసుకోగా అతనికి మంజూరైన రూ.60వేల సహాయాన్ని కూడా గాంధీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు శంకర్ గౌడ్, సాంబశివరావు, నరేష్ పాల్గొన్నారు.
