హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రంలో 6, 7, 8 తరగతులు చదువుతున్న విద్యార్థులకు బుధవారం నుంచి తరగతులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాలకు అనుగుణంగా 6, 7 , 8 తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ తరగతులను బుధవారం నుండి మార్చి 1వ తేదీలోగా ప్రారంభించుకోవచ్చని సూచించారు. కోవిడ్ మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని తెలిపారు.
