చందానగర్, (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని సిటిజెన్ కాలనీలో రూ.40 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో చేపట్టిన సి.సి రోడ్ పనులను కాలనీ వాసులతో కలిసి స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి శనివారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నవతారెడ్డి మాట్లాడుతూ కాలనీ లో రోడ్డు గుంతలుగా ఏర్పడటం వలన వాహనదారులు, కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారని, కాలనీ వాసులు కోరిక మేరకు ఈ సి.సి రోడ్ నిర్మించడం జరుగుతుందని అన్నారు. తాజా రోడ్డు నిర్మాణ పనులు కాలనీవాసులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ముజాహిద్, మొయిజ్, రషీద్,గౌస్, తదితరులు పాల్గొన్నారు.






