ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేరిట పాస్టర్ల ప్రత్యేక ప్రార్థనలు

నమస్తే శేరిలింగంపల్లి: క్రిస్మస్ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని ఆయా డివిజన్లలో గల చర్చిల్లో నిర్వహించిన క్రిస్మస్ సంబరాలలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీ సీఎస్ఐ వెస్లీ చర్చి లో, మియాపూర్ డివిజన్ పరిధిలోని బీకె ఎన్ క్లేవ్ రాక్ చర్చిలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గాంధీ పాల్గొని క్రిస్మస్ సోదరీ సోదరులందరికి క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా పనిచేస్తోందన్నారు.

ఆదర్శ్ నగర్ లోని సీఎస్ఐ వెస్లీ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గాంధీని సన్మానించిన ఫాస్టర్లు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రతి పండగకు కానుకలను పంపిణీ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, టీఆర్ఎస్ శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు చింతకింది రవీందర్ గౌడ్, పద్మారావు, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్, రమణ, పాస్టర్ స్వామి, క్రైస్తవ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.

బికె ఎన్ క్లేవ్ లోని రాక్ చర్చిలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here