పారిశుధ్య కార్మికులకు బిజెపి నాయకుల ఘన సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి: భారత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని, సుపరిపాలన దినోత్సవాన్ని బిజెపి శేరిలింగంపల్లి డివిజన్ నాయకులు ఘనంగా నిర్వహించారు. వాజ్ పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి కురుమ అధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు సన్మానం చేసి వారి పై పూలవర్షం కురిపించారు. పారిశుధ్య కార్మికులతో కలిసి సంయుక్త భోజనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ భారత దేశాన్ని ప్రగతి పథం లో నడిపించి అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్న మహా నేత, అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్‌పేయి అన్నారు. మన అందరి ఆరోగ్యం కోసం కష్ట పడే పారిశుధ్య కార్మికులను ఈ సుపరిపాలన దినోత్సవం రోజున సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ వాజ్‌పేయి బాటలో పయనించి భావి భారతావణిని నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి కాంచన కృష్ణ, రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా నాయకులు నాగులు పటేల్, రమేష్ సోమిశేట్టీ, మారం వెంకట్, రాధ మూర్తి, సుర్ణ శ్రీశైలం, భారత్ రాజ్, రాఘవేందర్ రావు, వినిత సింగ్, కాంటేస్టేడ్ కార్పొరేటర్ రాఘవేందర్, కే ఎల్లేశ్, డివిజన్ నాయకులు చిట్టా రెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి, సత్య కుర్మా, బీమాని విజయ లక్ష్మి, శ్రావణ్ పాండే, మనోజ్ ముదిరాజ్, అరుణ కుమారి, గాయత్రి, కిరణ్ కుమార్, శ్రీకాంత్, బి. స్వాతి కార్యకర్తలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.

వాజ్ పేయి జయంతి వేడుకల్లో శేరిలింగంపల్లి బిజెపి నాయకులు

 

పారిశుధ్య కార్మికులకు భోజనం వడ్డిస్తున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here