నమస్తే శేరిలింగంపల్లి: ఏసు ప్రభువు కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆకాంక్షించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి షేకిన క్రిస్టియన్ చర్చి, గౌలిదొడ్డి బసవతారక నగర్ లోని నమ్మ దగిన దేవుని ప్రార్ధన మందిరము లో స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ కేకును కట్ చేసి క్రిస్టియన్లందరికి శుభాకాంక్షలు తెలిపారు. గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదినంను పురస్కరించుకుని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో, భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోపన్‌పల్లి షేకిన క్రిస్టియన్ చర్చ్ అసెంబ్లీ పాస్టర్ దేవబలాన్, నమ్మ దగిన దేవుని ప్రార్ధన మందిరము పాస్టర్ బంగారు మోషే, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, ప్రకాష్, రంగస్వామి, మురగ, శ్రీనివాస్,రాజు, విష్ణు,చిన్న, శివ కుమార్, శివ, నరేందర్, రాకేష్, చిన్న, మౌసీన్, బంటీ తదితరులు పాల్గొన్నారు.