ర‌జ‌తోత్స‌వాల‌కు సిద్ధ‌మైన‌ చందాన‌గ‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌రాల‌యం – బుధ‌వారం నుంచి ఐదురోజుల పాటు వైభ‌వోత్స‌వాలు

  • శ్రీ స్వ‌రూపానందేద్ర స‌ర‌స్వ‌తి, స్వాత్మానందేంద్ర స్వామివార్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్ర‌త్యేక పూజ‌లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందాన‌గ‌ర్‌లోని విశాఖ శ్రీ శార‌దా పీఠ‌పాలిత శ్రీ వేంక‌టేశ్వ‌రస్వామి దేవాల‌య స‌ముదాయం స్థాపించి 25 వ‌సంతాలు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో అంగ‌రంగ వైభ‌వంగా ర‌జ‌తోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. బుధ‌వారం నుంచి ఐదు రోజుల పాటు వైభ‌వోత్స‌వాల పేరుతో విశాఖ శ్రీ శారదా పీఠాధిప‌తులు జ‌గ‌ద్గురు శ్రీ స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తీ మ‌హాస్వామి, ఉత్త‌ర‌పీఠాధిప‌తి స్వాత్మానందేంద్ర స్వామివార్ల ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నట్టు ఆల‌య పాల‌క‌మండ‌లి పేర్కొంది. ఉత్స‌వాల్లో మొద‌టి రోజు శ్రీ వ‌రాహ‌స్వామి శిలా విగ్ర‌హ సువ‌ర్ణ తాప‌డ ధ్వ‌జ సంస్మ‌ర‌ణ‌, చండీ హోమ‌ము త‌దిత‌ర పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. ప‌రిస‌ర ప్రాంతాల భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని స్వామి వారి కృప‌కు పాత్రులు కావాల‌ని పిలుపునిచ్చారు. ఐదురోజుల పాటు ఈ ప్ర‌త్యేక‌పూజా కార్య‌క్ర‌మాల్లో ధీక్ష వ‌హించి పాల్గొన‌ద‌ల‌చిన వారు రూ.1,01,116, గోత్ర‌నామార్చ‌నకు రూ.5116 చెల్లించి భాగ‌స్వాములు కావ‌చ్చున‌ని తెలిపారు.

ఆల‌య ప్రాంగ‌ణంలో ఆక‌ర్ష‌నీయంగా సిద్ధ‌మైన య‌జ్ఞ‌వేదిక‌లు

స్వామి వారి విశేష సేవ‌లో భ‌క్తుల స‌మ‌ర్ప‌ణ‌…
వైభ‌వోత్స‌వుల నేప‌థ్యంలో గ‌త కొంతకాలంగా చందాన‌గ‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌రాల స‌ముదాయం స‌ర్వాంగ సుంద‌రంగా త‌యార‌వుతుంది. ఈ క్ర‌మంలోనే అనేక మంది దాత‌లు త‌మ‌కు తోచిన విధంగా స్వామి వారి సేవ‌కు స‌మ‌ర్పించుకున్నారు. కేజేఎల్‌, ల‌క్ష్మీన‌ర్సింహా పౌల్ట్రీస్ అధినేత క‌లిదిండి స‌త్య‌నారాయ‌ణ రాజు, జాన్సీల‌క్ష్మీ దంప‌తులు సువ‌ర్ణ ధ్వ‌జస్థంభ తాప‌డం, అన్న‌దాన సేవ‌లో భాగ‌స్వామ్యుల‌య్యారు. అదేవిధంగా ఆల‌య క‌మిటి అధ్య‌క్షులు క‌ట్ల ర‌ఘుప‌తి రెడ్డి శ్రీ వరాహస్వామి ఆల‌య నిర్మాణానికి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తుడి సుభాష్ శ్రీ భూ వ‌రాహ‌స్వామి శిలా విగ్ర‌హానికి, ఉపాధ్య‌క్షులు తోట సుబ్బారాయుడు శ్రీ వరాహస్వామి పంచ‌లోహ విగ్ర‌హానికి దాత‌లుగా వ్య‌వ‌హరిస్తున్నారు. జుబ్లీహిల్స్‌కు చెందిన బి.శ్రీనివాస్‌రావు గోధాదేవి, ప‌ద్మావ‌తి దేవి అమ్మ‌వార్ల‌కు ఆభ‌ర‌ణాల‌ను, చందాన‌గ‌ర్‌కు చెందిన సుద‌ర్శ‌నం సాయి శ్రీక‌ర్ స్వామివారి శేష‌శ‌య‌న మూర్తిని స‌మ‌ర్పించ‌నున్నారు. తెల్లాపూర్ విజ‌న్ ఉర్జిత్‌కు చెందిన కె.బాపిరాజు య‌జ్ఞ‌వేధిక నిర్మాణంలో భాగ‌స్వాముల‌య్యారు.

ఉత్స‌వాల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు విచ్చేసిన విశాఖ శ్రీ శార‌దా పీఠం ఉత్త‌ర పీఠాధిప‌తి శ్రీ స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామికి స్వాగ‌తం ప‌లుకుతున్న ఆల‌య ప్ర‌ధానార్చకులు సుద‌ర్శ‌నం స‌త్య‌సాయి

ఆల‌య సుంద‌రీక‌ర‌ణ దాత‌లు…
ఆల‌య స‌ముదాయాన్ని అంద‌గా తీర్చిదిద్దే క్ర‌మంలో ఫ్లోరింగ్‌, రంగులు ఇత‌రాత్ర సేవా కార్య‌క్ర‌మాల్లో స‌తీష్‌చంద్ర‌గుప్త‌, సీహెచ్ ప్ర‌భాక‌ర్‌, రంజిత్‌రెడ్డి(ఎంపీ-చేవెళ్ల‌), సాయిబుక్ హౌజ్ రాజు బ్ర‌ద‌ర్స్‌, మాజీ కార్పొరేట‌ర్ పి.అశోక్‌గౌడ్‌, బి.నాగ‌రాజు, కె.దేవెంద‌ర్‌రెడ్డి, రామ‌కృష్ణంరాజు, వెంక‌ట‌స‌త్య‌రాంగోపాల్‌, ఆవినాష్ చౌద‌రి, కామేశ్వ‌ర‌మ్మ‌, వి.వెంక‌ట్‌రావు, ఎం.రాఘ‌వరావు, బి.జ‌గ‌దీశ్‌కుమార్‌, ఎస్‌.శ్రీనివాస్‌, సీహెచ్‌.వెంక‌ట‌సుబ్బారావు, ఎం.శివ‌శంక‌ర్‌గౌడ్, సీహెచ్ వెంక‌ట అనంత ర‌హాకాంత్‌, పి.రామ‌కృష్ణ శ‌ర్మ‌, డి.వీర‌వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ‌, వి.సాంబ‌శివ‌రావు, కె.స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, వి.శ్రీనివాస్‌, పి.ఆంజ‌నేయ‌రాజు. జి.వెంక‌ట‌రామ కృష్ణ‌, బి.ప్ర‌దీప్‌కుమార్ రాజు, ఎస్‌.స‌త్య‌నారాయ‌ణ‌, టి.ప్ర‌వీణ్‌, సీహెచ్‌.రామ‌కృష్ణ‌, ఎం.మ‌ల్లారెడ్డి, బి.బోగేంద్ర శివ‌ప్ర‌సాద్, కిర‌ణ్‌రెడ్డి, డి.విభీష‌ణ్ రెడ్డి, పి.ధ‌ర్మ‌,

విద్యుదీపాలంకర‌ణ‌లో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకుంటున్న ఆల‌య ముఖ‌ద్వారం

ఎస్‌.లింగ‌మూర్తి, డి.వెంక‌ట సుబ్బ‌న‌ర్సింహారావు, వి.ఉమామ‌హేశ్వ‌ర శాస్త్రీ, పీ.హ‌రీప్ర‌సాద్‌, పి.రంగ‌నాథ్‌, బి.జ‌గ‌దీశ్ చంద్ర‌చౌద‌రి, పి.రాములు, పి.వెంక‌ట్‌రావు, ఎస్‌.శ్రీనివాసాచార్యులు, ఆర్‌.వెంక‌ట‌భాను ప్ర‌సాద్‌, ఎం.ధ‌ర్మారావు, ఎం.మ‌నోజ్‌కుమార్ రెడ్డి, ఎం.శేష‌గిరిరావు, సీహెచ్.సూర్య‌నారాయ‌ణ రాజు, సుధామ‌ణి, సీహెచ్. వెంక‌ట రామ‌కృష్ణ పెద్దిరాజు, ఎం.శ్రీరామ మూర్తి, ఎం.శ్రీనివాస రావు, మౌనిక‌-న‌వ్య‌, డి.వెంక‌ట‌దుర్గ మ‌హేష్వ‌ర్‌రావు, వెంక‌ట‌సుబ్బ‌రాజు, ఆర్ న‌ర్సింహా, ఎం.నారాయ‌ణ‌, కె.రామ‌కృష్ణ‌రావు, ఎ.ద‌శ‌ర‌థ్‌రెడ్డి, ఎం.భాస్క‌ర్‌రావు, వై.గోవింద‌రాజులు, వెంక‌ట‌ర‌మ‌ణ‌రెడ్డి, వీర‌వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ మూర్తి, ఎస్‌.నివేదిత్‌, సి.భానుకృష్ణ, బి.అశ్విన్ కుమార్‌, డీ. సావిత్రిశ్రీనివాస్‌, జి.మోహ‌న్‌రావు, కృష్ణ‌రెడ్డి కుమారులు, వి.శ్రీకాంత్‌, సీహెచ్‌.వ‌ర‌ణ్‌తేజ్ రెడ్డి-త‌రుణ్‌తేజ్ రెడ్డి, ఎస్‌వీ.వంశీకృష్ణ ప్ర‌సాద్‌, టీ.వంశీకృష్ణతో పాటు అనేక మంది భాగ‌స్వ‌ములు అవ‌నున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here