నమస్తే శేరిలింగంపల్లి: బాలాపూర్ వినాయకుడి లడ్డుకు భారత్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. ప్రముఖ నాట్యకళాకారుడు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం 92వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని రవీంద్ర భారతిలో భారత్ ఆర్ట్స్ అకాడమి, ఏబీసీ ఫౌండేషన్ ఆద్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే భారత్ వరల్డ్ రికార్డ్స్‌ను ప్రకటించారు. హైదరాబాద్ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో విశేషమైన బాలాపూర్ వినాయకుడి లడ్డూ భారత్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. కాగా 2010(17వ వేలంపాట)లో 5.35 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్న శేరిలింగంపల్లి మియాపూర్ ప్రాంతానికి చెందిన కొడాలి శ్రీధర్‌కు అవార్డు అందుకున్నారు. ముఖ్యఅతిథి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి చేతుల మీదుగా ఆవార్డు స్వీకరించిన అంనంతరం శ్రీధర్ మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన బాలాపూర్ లడ్డు భారత్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆ అవార్డును తాను అందుకునే భాగ్యం లభించడం అదృష్టంగా బావిస్తున్నట్టు తెలిపారు. నిర్వాహకులు లలితారావు, రమణరావు దంపతులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.