నమస్తే శేరిలింగంపల్లి: జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ అధ్వర్యంలో హైదరబాద్ ఆబిడ్స్ లోని తెలంగాణ సరస్వతి పరిషత్ నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో విశిష్ట సేవ పురస్కార్ కరొన వారియర్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఎన్ సీ ఆర్ సీ రంగారెడ్డి జిల్లా చైర్మన్ చింతకింది మహేందర్ గౌడ్ ఈ అవార్డు దక్కింది. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఎన్ సీ ఆర్ సీ వ్యవస్థాపకులు, నేషనల్ చైర్మన్ ఎంవీల్ నాగేశ్వర రావు, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ చేతుల మీదుగా ఈ అవార్డును చింతకింది మహేందర్ గౌడ్ అందుకున్నారు. ఈ సందర్బంగా మహేందర్ గౌడ్ మాట్లాడుతూ ఎన్ సీ ఆర్ సీ సేవలను జిల్లా వ్యాప్తంగా మరింత విస్తృత పరిచేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. జిల్లా వ్యాప్తంగా కమిటీలను పూర్తి చేసి వినియోగదారుల హక్కులను రక్షించటం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వారధిగా పనిచేసి వినియోగదారుడి హక్కులను కాపాడుతామని అన్నారు. వస్తుసేవల నాణ్యతలో ఇలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎన్ సీ ఆర్ సీ ని ఎప్పుడైనా ఆశ్రయించవచ్చన్నారు. ఈ అవార్డు రావటానికి తోడ్పడిన నేషనల్, రాష్ట్ర సభ్యులకు మహేందర్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
