నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవాలయాలు వైభవాన్ని సంతరించుకుంటున్నాయని ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి పేర్కొన్నారు. శేరిలింగంపల్లి పరిధిలోని సెంట్రల్ పార్క్ కాలని ఫేజ్ -2 వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి ప్రభుత్వ విప్, శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్యాత్మికత పట్ల మక్కువ చూపే మంచి మనిషి అన్నారు. దేవాలయాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. సెంట్రల్ పార్కు ఫేజ్ -2 లో నూతనంగా వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మాణం చేపట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కాలనీ పార్క్ ప్రెసిడెంట్ రమణి, కాలనీ సెక్రటరీ రాధాకృష్ణ, హరినారాయణ, రామకృష్ణ, గోపాల్ యాదవ్, పటోళ్ల నర్సింహా రెడ్డి, సెంట్రల్ ఫేజ్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
