విద్యార్థి ఉన్నత చదువుకు విప్ గాంధీ ఆర్ధిక సహాయం

చెక్కు రూపంలో రూ. 1లక్ష 26వేలు అందజేత

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ కు చెందిన వీరన్న యాదవ్ (లేట్ ) సుభద్ర కుమారుడు సుమంత్ ఉన్నత చదువులకోసం ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విద్యా సంవత్సరంకు ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు రూ . 1,26,500 లను చెక్కు రూపేణా చెల్లించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వీరయ్య యాదవ్ మరణంతో వారి కుటుంభం వీధిన పడకూడదనే ఉద్దేశ్యంతో.. వారి పిల్లల చదువులు ఆగిపోకుండా ఉండేందుకు వారిని దత్తత తీసుకుని చదివిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పెద్ద కుమార్తె గీత ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని సాఫ్ట్ వేర్ గా స్థిరపడిందని, చిన్న కూతురు హర్షిత భద్రుక కళాశాలలో పీజీ చదువుతుందని , వారి కుమారుడు సుమంత్ మల్లారెడ్డి కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడన్నారు. సుమంత్ ఇంజనీరింగ్ విద్యానభ్యసించడానికి కాలేజీ ఫీజుల నిమిత్తం రూ. 1,26,500లను చెక్కు రూపేణా ఇచ్చానని పేర్కొన్నారు.

సుమంత్ కు ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజ్ నిమిత్తం చెక్ అందజేస్తున్న ఎమ్మెల్యే గాంధీ 

గీత, హర్షితలను స్ఫూర్తి గా తీసుకొని చక్కగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని, ఉన్నత శిఖరాలు అందుకోవాలని విప్ గాంధీ సుమంత్ ను ఆశీర్వదించారు. ఎప్పుడు ఏ సహాయం కావల్సిన తన వంతు కృషి  చేస్తానని చెప్పారు. ఆర్థిక సహాయం అందజేసిన సందర్బంగా విద్యార్థి, తన కుటుంబ సభ్యులు ప్రభుత్వ విప్ గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here