నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్
పరిధిలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి చెప్పారు. చందానగర్ డివిజన్ పరిధిలోని రేగులకుంట చెరువు, సత్యనారాయణ ఎన్ క్లేవ్ తదితర కాలనీలలో జరుగుతున్న అభివృద్ధి పనులను శేరిలింగంపల్లి జోనల్ మున్సిపల్ కార్యాలయం ఎస్ఈ శంకర్ నాయక్ తో కలిసి కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంటుందన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో సమస్యలను పరిష్కరిస్తూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ఈఈ శ్రీకాంతి, డీఈ స్రవంతి, ఏఈలు శివప్రసాద్, అనురాగ్, ప్రతాప్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సంపత్, డీఈలు శేషగిరి, నళిని, ఏఈ పావని, టీఆర్ఎస్ నాయకులు నరేందర్ భల్లా, అక్బర్ ఖాన్, దాస్ తదితరులు పాల్గొన్నారు.