నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని అన్ని సమస్యలను పరిష్కరించి అభివృద్ధిలో ఆదర్శంగా ఉంచుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఆయా శాఖల అధికారులతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పర్యటించారు. జవహార్ నగర్ కాలనీ లో నెలకొన్న సమస్యలను, పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. కాలనీలో పార్క్ ను ఏర్పాటు చేయాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తప్పకుండా పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు, విద్యుత్ దీపాలు తదితర సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు.
అనంతరం ఎస్టీపీ ప్లాంటు నుంచి శంకర్ నగర్ నాలా వరకు కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఆర్ సీ సీ పైపులైన్ నిర్మాణం పనులను పరిశీలించారు. పైప్ లైన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని, అధికారులందరూ అప్రమాత్రంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, డీఈ స్రవంతి, ఏఈ శివప్రసాద్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు హరీష్, శివప్రసాద్, చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీ నారాయణ గౌడ్, నాయకులు అక్బర్ ఖాన్, ప్రవీణ్ రెడ్డి, నరేష్, సుమంత్ రెడ్డి, వరలక్ష్మి రెడ్డి, నరేందర్ బల్లా ,దాస్, కొండల్ రెడ్డి, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కర్ణాకర్ గౌడ్, అక్బర్ ఖాన్, ప్రవీణ్ రెడ్డి, నరేష్, సుమంత్ రెడ్డి, వరలక్ష్మి రెడ్డి, నరేందర్ బల్లా, దాస్, కొండల్ రెడ్డి, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి, జవహర్ నగర్ కాలనీ వాసులు శంకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, చారి, సత్యనారాయణ, శివ నారాయణ, జగదిశయ్య, లక్ష్మయ్య, ప్రభాకర్, మోహన్ రెడ్డి, రమేష్, మాధవరావు, హేమంత్ కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ ఫేస్- 2 లో శ్రీ షిర్డి సాయి బాబా మందిరం 17 వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, నరేంద్ర బల్లా, సందీప్ రెడ్డి, దాస్ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.