నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం కో ఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి డిమాండ్ చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు చందానగర్ డివిజన్ లోని గాంధీ విగ్రహం ఎదుట శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కో ఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రధాన మంత్రి మోడీ ఇష్టారీతిగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో పాటు జీఎస్టీని పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజల జీవనం కష్టంగా మారిందని వాపోయారు. సామాన్య ప్రజలను పట్టించుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారీతిగా ధరలను పెంచుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఈ ధర్నాలో కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, నాయకులు
జెరిపాటి జైపాల్, వీవీఎన్ఎస్ చౌదరి, ఎం. శ్రీనివాస్, బి. యాదగిరి, అయాజ్, జహంగీర్, హరి, ప్రణీత్, డి. శ్రీనివాస్, వహీద, అరుణ, గోపాల్, అక్బర్, మనెమ్మ, కవిరాజ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
