లింగంపల్లిలో గాలి పోచమ్మ దేవత విగ్రహం పునః ప్రతిష్టాపన – ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి గ్రామంలో మాట్రిక్స్ ఆర్చిడ్స్ అపార్ట్ మెంట్ ఎదురుగా నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ గాలి పోచమ్మ దేవత విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పోచమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేసి పునః ప్రతిష్ట చేయడం సంతోషకరమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు యాదగిరి గౌడ్, కృష్ణ యాదవ్, రమేష్ , వేణు గోపాల్ రెడ్డి, నటరాజ్, లింగం శ్రీనివాస్, రవి యాదవ్, కుమార్, బిట్టు గౌడ్, నరసింహ గౌడ్, మాట్రిక్స్ ఆర్కిడ్స్ కుటుంబ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

గాలి పోచమ్మ వారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here