నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 21సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతీ కార్యకర్త పార్టీ ఆవిర్భావ వేడుకలను ఒక పండగలా జరుపుకోవాలని చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి సూచించారు. ఈ నెల 27 న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాదాపూర్ హెచ్ఐసీసీలో నిర్వహించనున్న ప్లీనరీ సమావేశం సన్నద్దంలో భాగంగా మియాపూర్ లోని నరేన్ గార్డెన్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా తరలివెళ్లారు. చందానగర్ లోని శంకర్ నగర్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ రహదారి గుండా నరేన్ గార్డెన్ వరకు పెద్ద సంఖ్యలో బయల్దేరి వెళ్లారు.