టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవాన్ని పండగలా జరుపుకోవాలి – నియోజకవర్గం విస్తృత సమావేశంలో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి డివిజన్ లో, ప్రతి కాలనీలో కార్యకర్తలు, నాయకులు పార్టీ జెండాలను ఎగరవేసి అంగరంగ వైభవంగా ఓ పండగలా నిర్వహించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సూచించారు. ఈ నెల 27న మాదాపూర్ హెచ్ ఐసీసీలో నిర్వహించనున్న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, ప్లీనరీ సమావేశంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో సోమవారం మియాపూర్ లోని నరేన్ గార్డెన్స్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, పూజిత జగదీశ్వర్ గౌడ్, సింధు ఆదర్శ్ రెడ్డి, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి  

శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అన్ని బస్తీలలో, వాడవాడలా టీఆర్ఎస్ పార్టీ జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ సాధించిన విజయాలకు సూచికగా ఒక పండుగలా జరుపుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరేలా ప్రతి కార్యకర్త కృషిచేయాలని తెలిపారు. సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి ఉద్యమాన్ని ముందుకు తీసుకొనిపోతుందన్నారు. 27న ఆహ్వానిత నాయకులు 10 గంటల లోపు సమావేశ ప్రాంగణానికి చేరుకోవాలన్నారు.10 గంటల నుంచి 11 గంటలకు ఆహ్వానితుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ జెండాను ఎగురవేసి సమావేశాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, వార్డు, ఏరియా కమిటీ సభ్యులు, బస్తీ అధ్యక్షులు, మహిళ నాయకులు, పార్టీ ప్రధాన, అనుబంధ కమిటీలు, బస్తీ కమిటీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశం లో పాల్గొన్న నియోజకవర్గం టీఆర్ఎస్ ‌నాయకులు, కార్యకర్తలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here