
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం హనుమాన్ దేవాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మూడవ రోజు వైభవంగా కొనసాగాయి. సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధానార్చకులు దత్తాత్రేయ పర్యవేక్షణలో కుంకుమార్చన, హోమం నిర్వహించారు. పరిసర ప్రాంతాల మహిళలు పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం యాదవ్, కమిటీ సభ్యులు శ్రవణ్ కుమార్, ఆర్ రవి కుమార్, నరసింహ, దినేష్ లతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.






