చందాన‌గ‌ర్ స‌ర్కిల్ స్ట్రీట్ వెండ‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా అక్భ‌ర్ ఖాన్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందానగర్ స‌ర్కిల్‌ స్ట్రీట్ వెండర్స్ అసోసియేష‌న్ ప్రధాన కార్యదర్శిగా వేముకుంట‌కు చెందిన టీఆర్ఆస్ సీనియ‌ర్ నాయ‌కుడు అక్బర్ ఖాన్ నియామకం అయ్యారు. అసోసియేష‌న్‌ ఆధ్యక్షుడు కొండా విజయ్ అక్భ‌ర్ ఖాన్ నియామకాన్ని ప్రకటించారు. ఈ క్ర‌మంలో చందాన‌గ‌ర్ స‌ర్కిల్‌ స్ట్రీట్ వెండ‌ర్స్ అసోసియేష‌న్ అధ్యక కార్య‌ద‌ర్శులు కొండా విజ‌య్‌కుమార్‌, అక్భ‌ర్ ఖాన్‌లు మంగ‌ళ‌వారం ప్ర‌భుత్వ విప్‌, స్థానిక శాస‌న‌స‌భ్యులు అరేకపూడి గాంధీని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా గాంధీ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అక్బర్ ఖాన్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అనంత‌రం అక్భ‌ర్ ఖాన్ మాట్లాడుతూ త‌నను ఏకగ్రీవంగా‌ ఎన్నుకున్న అసోసియేష‌న్ సభ్యులందరికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వీధి వ్యాపారుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వ విప్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార‌మయ్యేలా చూస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చందానగర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డి రఘు నాథ్ రెడ్డి, అసోసియేష‌న్ స‌భ్యులు నక్క శ్రీను, ప్రతాప్ రెడ్డి, అహ్మద్, జాహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

అక్బర్ ఖాన్‌ కు అభినందనలు తెలుపుతున్న‌ ప్రభుత్వ ‌విప్ గాంధీ, చందానగర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డి రఘు నాథ్ రెడ్డి, అసోసియేష‌న్‌ ఆధ్యక్షుడు కొండా విజయ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here