నమస్తే శేరిలింగంపల్లి: అమీన్ పూర్ చెరువు నుండి చందానగర్ డివిజన్ కు వచ్చే అలుగు నీటి ప్రవాహం, డ్రైనేజీ వాటర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి తెలిపారు. అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్ జగదీష్ తో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి భవానీ పురం, ఎన్ బీ ఆర్ కాలనీలలో పర్యటించారు. అమీన్ పూర్ చెరువు నుంచి అలుగు నీటి ప్రవాహం, డ్రైనేజీ నీరు చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల మీదుగా ప్రవహిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిషనర్ కు సమస్యను వివరించారు. కాలనీలలో నెలకొన్న సమస్యను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు, భవానిపురం, ఎన్ బీ ఆర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.