కార్పొరేటర్ స్వంత‌ నిధులతో ప్రారంభమైన సీసీ కెమెరా పనులు

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీ భద్రత‌ కోసం, నేటి సమాజంలో‌ మహిళలపై‌ జరుగుతున్న అఘాయిత్యాలను దృష్టిలో పెట్టుకుని సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకువచ్చిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు ఆరంబ్ టౌన్ షిప్ కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆరంబ్ టౌన్ షిప్ టిఆర్ఎస్ పార్టీ కమిటీ అభ్యర్థన మేరకు స్థానిక కార్పొరేటర్ రాగం‌ నాగేందర్ యాదవ్ తన స్వంత నిధులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. గురువారం సీసీ కెమెరాల ఏర్పాటు పనులు ప్రారంభమైనట్లు‌ కాలనీ వాసులు తెలిపారు. ఆరంబ్ టౌన్ షిప్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, పార్టీ గౌరవ అధ్యక్షుడు నర్సింహులు యాదవ్, అసోసియేషన్ ట్రెజరర్ నరేంద్ర కుమార్, జాయింట్ సెక్రెటరీ మహిపాల్ యాదవ్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు నయీమ్ ఉద్దీన్, మహిళా విభాగం అధ్యక్షురాలు అరుణ విక్రమ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, ఉపాధ్యక్షులు డి. సరిత, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు జనార్ధన్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఆరంబ్ టౌన్ షిప్ లో‌ ప్రారంభమైన సీసీ‌ కెమెరా పనులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here