శేరిలింగంపల్లి, జూలై 4 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ లోని ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది పిల్లి నాగరాజు నివాసంలో గురువారం సాయంత్రం బ్రహ్మ కమలం విరబూసింది. వారి కుటుంబ కుటుంబ సభ్యులు బ్రహ్మ కమలానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవంతుడికి ప్రీతిపాత్రమైన అరుదైన బ్రహ్మ కమలం తమ ఇంట విరబోయడం తమ అదృష్టమని నాగరాజు అన్నారు.