నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో శ్రీ కృష్ణాష్టమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కృష్ణాష్టమిని పురస్కరించుకుని కందుల కూచిపూడి నాట్యాలయం రవి శిష్య బృందం చేసిన కృష్ణ నాట్య తరంగిణి కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినయకౌతం, మూషిక వాహన, మహా గణపతిమ్, పుష్పాంజలి, గరుడ గమన, జతిస్వరం, పలుకే బంగారమయేనా, భోశంభో, తక్కువేమి మనకు, ఇతడేయ్ పరబ్రహ్మ, కృష్ణ శబ్దం, కృష్ణం కలయ సఖి, నీలమేఘ శరీర, తిల్లాన తదితర అంశాలపై నృత్య ప్రదర్శన చేశారు. కళాకారులు శ్లోక, మహతి, సిరి, ధన్వి, కిరణ్మయి, స్నిగ్ధ, వెంకట స్తుతి, గాయత్రీ, మనస్వి, ఆశ్విత, అహనా తదితరుల నాట్య ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నాయి. నాట్య గురువులు డాక్టర్ ఎస్ పి భారతి, కాజా వెంకట సుబ్రహ్మణ్యం, వేదాంతం సత్య నరసింహ శాస్త్రి, ప్రకాష్ చారీ హాజరై కళాకారులను అభినందించారు.